శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (11:53 IST)

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
క్షతగాత్రులను ఆత్మకూరు ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. 
 
మదనపల్లి వైపు నుంచి వస్తున్న లారీని విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.