ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో నకిలీ టాటా విరాన్ చైన్ లింక్ ఫెన్స్‌లతో పాటుగా బార్బ్‌డ్ వైర్లు స్వాధీనం
టాటా విరాన్ యొక్క చైన్ లింక్ ఫెన్స్‌లు మరియు బార్బ్‌డ్ వైర్ వినూత్నమైన పద్ధతిలో ప్యాకేజీ చేయబడటంతో పాటుగా ఒరిజినల్ ఉత్పత్తులన్నీ కూడా అదే తరహా ప్యాకేజింగ్‌ను కలిగి ఆధీకృత డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి టాటా విరాన్ చెయిన్ లింక్ ఫెన్స్‌లు మరియు బార్బ్‌డ్ వైర్ ఉత్పత్తులను ప్రామాణీకరణ ప్యాకేజీలో లేకుండా విక్రయిస్తున్నారని అందుకున్న సమాచారం అనంతరం, వేదాయపాలెం పోలీస్ స్టేషన్, వీ సతారం పోలీస్ స్టేషన్ మరియు సిదాపురం పోలీస్ స్టేషన్‌ల సహకారంతో ఏక కాలంలో నాలుగు ప్రాంతాలలో ఉమ్మడిగా దాడులు చేశారు.
ఆధీకృతం కాకుండా టాటా విరాన్ పేరును వినియోగించడం అనేది టాటా స్టీల్ యొక్క మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే. ఈ స్టోర్ల యజమానులు నకిలీ చైన్‌లింక్ ఫెన్స్ మరియు బార్బ్‌డ్ వైర్లను నాణ్యత లేకుండా విక్రయించడంతో పాటుగా వాటిని టాటా విరాన్ ఉత్పత్తులుగా వెల్లడించి విక్రయిస్తున్నారు. ఒకేరోజు పలు ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో ఈ దాడులను సంయుక్తంగా నిర్వహించడంతో పాటుగా పలు కేసులను బుక్ చేయడం జరిగింది. ఆ వివరాలు...
తయారీదారుని పేరు- ఆసియన్ వైర్ ఇండస్ట్రీస్ పైన వేదాయపాలెం పీఎస్, నెల్లూరు నగరంలో సెక్షన్ 420 ఐపీసీ(కాపీరైట్ చట్టం సెక్షన్ 63) కింద కేసు నమోదు. తయారీదారుని పేరు- శ్రీ వెంకటేశ్వర వైర్ ప్రొడెక్ట్స్ పైన వేదాయపాలెం పీఎస్, నెల్లూరు నగరంలో సెక్షన్ 420 ఐపీసీ(కాపీరైట్ చట్టం సెక్షన్ 63) కేసు నమోదు. తయారీదారుని పేరు- శ్రీ లక్ష్మి వైర్ ఇండస్ట్రీస్ పైన వి సతారం, పీఎస్, నెల్లూరు నగరంలో సెక్షన్ 420 ఐపీసీ(కాపీరైట్ చట్టం సెక్షన్ 63) కేసు నమోదు. తయారీదారుని పేరు- శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్ పైన సైదాపురం పీఎస్, నెల్లూరు రూరల్‌లో సెక్షన్ 420 ఐపీసీ(కాపీరైట్ చట్టం సెక్షన్ 63) కేసు నమోదు.
వినియోగదారుల మనస్సులో టాటా స్టీల్ ఉత్పత్తులకు, నాణ్యమైన ఉత్పత్తులుగా అసాధారణ గౌరవం ఉంది. ఈ తరహాలో అనధికారికంగా టాటా పేరును, నాణ్యతా ప్రమాణాలు అందుకోని మరియు టాటా స్టీల్ ఉత్పత్తులు కాని వాటికి వినియోగించడం ద్వారా టాటా స్టీల్ గౌరవానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. టాటా స్టీల్ ట్రేడ్‌మార్క్స్, లోగోలను మరియు టాటా సన్స్ లోగోలు మరియు ట్రేడ్‌మార్క్స్‌ను అనధికారికంగా, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వినియోగించడాన్ని టాటా స్టీల్ తీవ్రంగా ఖండిస్తుంది. మా బ్రాండ్ పరపతి మరియు గుడ్‌విల్‌ను కాపాడుకుననే క్రమంలో, టాటా స్టీల్ యొక్క బ్రాండ్ ప్రొటెక్షన్ బృందం స్థిరంగా ఈ అంశాలను పర్యవేక్షించడంతో పాటుగా మా మేథో సంపత్తి హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించడంతో పాటుగా నకలీలను చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటుంది.
మా ఆస్తులు మరియు బ్రాండ్‌పై ప్రభావం చూపే ఈ తరహా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఏవైనా సరే మేము వాటికి వ్యతిరేకంగా చర్యలను తీసుకోవడంతో పాటుగా ఈ ప్రయత్నంలో మా చర్యలను కొనసాగిస్తున్నాము.