సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (13:31 IST)

వైకాపా నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురు...

devineni avinash
వైకాపనేత దేవినేని అవినాష్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు యత్నిస్తుండగా.. విమానాశ్రయ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం ఏపీలోని మంగళగిరి పోలీసులకు వారు సమాచారం అందించారు. 
 
ఆయనపై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారిని కోరారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్‌ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో.. ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
 
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి.. లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.