శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 31 డిశెంబరు 2018 (19:56 IST)

ఆన్ లైన్ వ్యభిచారం బిజినెస్.. సైటు.. రేటు కూడా ఫిక్స్ చేస్తున్నారు...

ఇప్పుడంతా డిజిటల్‌మయం. ఎ టు జెడ్ లావాదేవీలన్నీ ఆన్లైన్ లోనే సాగిపోతూ ఉంటాయి. అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఆన్‌లైన్‌లో సాగిపోతున్నాయి. ఆన్ లైన్ వ్యభిచారం బిజినెస్ మెట్రో సిటీస్‌లో కామనైపోయింది. ఈ ఆన్‌లైన్ వ్యభిచారం ఇప్పుడు మిగతా నగరాలకు పాకుతోంది. గుంటూరులో ఆన్‌లైన్ వ్యభిచారం బిజినెస్ కలకలం రేపుతోంది.
 
గుంటూరులో మెట్రో కల్చర్ మొదలైంది. అదేదో మంచి కల్చర్ అనుకుంటే పొరపాటే. పక్కా పాడు కల్చర్. మెట్రో పాలిటిన్ నగరం తరహాలో గుంటూరులో కూడా ఆన్ లైన్ వ్యభిచారం దందా ఇప్పుడు కలకలం రేపుతోంది. అమ్మాయిల బుకింగ్ దగ్గరి నుంచి పేమెంట్ల వరకు అంతా ఆన్ లైన్ లోనే. 
 
విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఆన్ లైన్ వ్యభిచారం బిజినెస్ సాగిస్తున్న బాగోతం బయటపడింది. ఓ విటుడు ఇచ్చిన సమాచారంతో ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విశాఖజిల్లా మాకవరం పాలానికి చెందిన శివప్రసాద్ గతంలో ఓ వ్యభిచార గృహ నిర్వాహకుడి దగ్గర పనిచేసేవారు. అమ్మాయితో పాటు మధ్యవర్తులతో పరిచయం పెట్టుకున్నాడు. సొంతంగానే దుకాణం పెట్టుకున్నాడు. ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించారు.
 
ఆ వెబ్ సైట్‌లో అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. జిల్లాల వారీగా అమ్మాయిల వివరాలు అందుబాటులో ఉంచారు. ఫోటోల కింద సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ ఇచ్చారు. వెబ్ సైట్ కేంద్రంగా ఒక రాత్రి నుంచి వారం రోజుల వరకు అమ్మాయిలను పంపించే దందాను నడిపిస్తున్నాడు. ఫోన్లో మాట్లాడే వ్యక్తి డబ్బులు ఇస్తాడని తెలిస్తే వాట్సాప్‌లో అమ్మాయిల ఫోటోలు పంపుతారు. 
 
డీల్ కుదిరిందంటే ఆన్ లైన్‌లోనే పేమెంట్ చేయాలి. ఇలా విశాఖ, నెల్లూరు, తిరుపతి కేంద్రాలను విస్తరించినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులకు రహస్య సమాచారం రావడంతో నిందితుడితో పాటు పదిమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్వాహకుడిని అరెస్టు చేసి యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు పోలీసులు.