శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (13:09 IST)

షాకింగ్ - రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ స్టోరీ లీకైంది..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న‌ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.   బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తోన్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కంటే.. రూమర్లు ఎక్కువగా షికార్లు చేస్తున్నాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ మూవీ క‌థ ఇదే అంటూ ఓ క‌థ ప్ర‌చారంలోకి వ‌చ్చింది.
 
ఇంత‌కీ ఆ క‌థ ఏంటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారట‌. చెర్రీ పోలీస్‌గా కనిపిస్తే.. తారక్ బందిపోటుగా క‌నిపిస్తాడ‌ట‌. అయితే... ఎన్టీఆర్, చెర్రీ చనిపోతారని... వీరిద్దరూ ప్రాణస్నేహితులని... స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగే భీకర పోరులో వీరిద్దరూ చనిపోయి.. మళ్లీ పుట్టి ప్రాణస్నేహితులుగా మారతారట. 1930ల నుంచి 2020 వరకూ ఈ స్టోరీ ట్రావెల్ అవుతుందని చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న ఈ స్టోరీ గురించి జ‌క్క‌న్న స్పందిస్తాడేమో చూడాలి.