'వెన్నుపోటు' చెత్తగా ఉంది.. అరుపులు కేకలు తప్పా మరేమీ లేదు...

kathi mahesh
Last Updated: ఆదివారం, 23 డిశెంబరు 2018 (16:14 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ తెరకెక్కించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందిస్తూ, ఈ పాటలో అరుపులు, కేకలు తప్ప మరేమీ లేదన్నారు.

అయితే, టీడీపీ నేతలు మాత్రం అనవసరంగా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఈ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉంటే మంచిదన్నారు. వర్మ సినిమా రెండు రోజులకు మించి ఆడదని చెప్పారు.

ఇక క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందన్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని అన్నారు. కాకపోతే, యంగ్ ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణ బదులు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వైసీపీ అభిమానులు మద్దతు పలకడం కూడా వేస్ట్ అని కత్తి మహేష్ అన్నారు.దీనిపై మరింత చదవండి :