డీప్ ఫ్రిజ్‌లో మంచు శివలింగం... బెజవాడలో భక్తుల పూజలు(Photos)
విజయవాడ: అమర్నాథ్‌లో మంచు శివలింగాన్ని భక్తులు విశేషంగా పూజిస్తారు. కానీ, అలాంటి శివలింగం... విజయవాడలోనూ ఉందంటున్నారు భక్తులు. అదీ డీప్ ఫ్రిజ్‌లో మంచు శివలింగం ఏర్పడిందట. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని చెరువు సెంటర్ సితార వద్ద కొండ
విజయవాడ: అమర్నాథ్‌లో మంచు శివలింగాన్ని భక్తులు విశేషంగా పూజిస్తారు. కానీ, అలాంటి శివలింగం... విజయవాడలోనూ ఉందంటున్నారు భక్తులు. అదీ డీప్ ఫ్రిజ్‌లో మంచు శివలింగం ఏర్పడిందట. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని చెరువు సెంటర్ సితార వద్ద కొండూరి అమల అనే మహిళ ఇంట్లో డీప్ ఫ్రిజులో మంచుతో కూడిన శివలింగం ఉద్భవించిందట.
ఆమె ఈ విషయాన్ని గమనించి అలా చెప్పిందో లేదో... ఇంకేముంది భక్తులు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. డీప్ ఫ్రిజులో ఉన్న ఆ మంచు శివలింగానికి పూజలు చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ మంచు శివలింగం ఎలా ఏర్పడిదంటే... ఆ ఇంటి ఇల్లాలు... అంతా శివయ్య మహత్యం అంటోంది.