శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 2 ఆగస్టు 2017 (08:23 IST)

అస్తమా కారణంతో ఊపిరందని బాలుడు. అంత పెద్ద విమానమూ దిగొచ్చింది

సముద్ర తీరంలో, బీచ్‌లలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అసలు తిరగకూడదని వైద్యులు చాలా కాలంగా చెబుతున్నారు. బీచ్‌లలోనే కూడా మరికొన్ని స్థలాల్లో కూడా అస్తమా వ్యాధిగ్రస్తులు ఉండకూడదని అనుకోకుండా జరిగిన ఒక ఘటన అనుభవపూర్వకంగా తెలుపుతోంది. పూర్తిగా తలుపులు మూసి, ఏస

సముద్ర తీరంలో, బీచ్‌లలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అసలు తిరగకూడదని వైద్యులు చాలా కాలంగా చెబుతున్నారు. బీచ్‌లలోనే కూడా మరికొన్ని స్థలాల్లో కూడా అస్తమా వ్యాధిగ్రస్తులు ఉండకూడదని అనుకోకుండా జరిగిన ఒక ఘటన అనుభవపూర్వకంగా తెలుపుతోంది. పూర్తిగా తలుపులు మూసి, ఏసీ వాతావరణంలో ఉండే విమానంలో ప్రయాణించడం కూడా అస్తమా రోగులకు ప్రాణాంతకమేనని తెలిసింది. 
 
విషయం ఏమిటంటే.. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  హైదరాబాద్‌కు బయల్దేరిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలుడు తీవ్ర అస్వ స్థతకు గురయ్యాడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. స్పైస్‌ జెట్‌ విమానం విశాఖ నుంచి మంగళవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరింది. 
 
కొద్దిసేపటికే విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఊపిరందక విల విల్లాడిపోయాడు. బాలుడి తల్లి ఆందోళ నకు గురికావడంతో విమానాన్ని తిరిగి విశాఖకు తీసుకొచ్చారు. ఈలోగా విమానాశ్రయంలో అప్రమత్తమైన వైద్య బృందాలు బాలుడికి ప్రాథమిక వైద్యమందించాయి. 
 
ఆస్తమా కారణంగా బాలుడు ఇబ్బంది పడినట్టు వైద్యులు తేల్చారు. దీంతో తల్లీకొడుకులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత విమానం విశాఖ నుంచి రాత్రి 10.15 గంటలకు తిరిగి బయల్దేరింది.