బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?
భారతీయ జనతా పార్టీ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ పర్యటనలో ఉన్నపుడు ఆయన బాత్రూమ్‌లో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేయికి తీవ్ర గాయమైనట్టు సమాచారం. లండన్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లండన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడ నుంచే ఆయనను నేరుగా బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్‌కు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయి.
కాగా, ఆయన ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లో జారిపడ్డారు. లండన్‌లో వైద్యులు ఆయనకు తక్షణ వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స, ఆపరేషన్ అవసరమని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ నగరానికి తరలించారు.