సుందరమ్మ పేట నా పుట్టినిల్లు లాంటిది : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు మున్సిపాల్టీ 14 వార్డు సుందరమ్మ పేటలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చనపతి బంగారమ్మ అనే పేద కుటుంబానికి రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ మరియు స్థానిక తెలుగుదేశం నాయకుల సహకారంతో 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సుందరమ్మ పేట నా పుట్టినిల్లు లాంటిదని, ఎందుకంటే నేను 1995లో ఉయ్యూరు ఇండిపెండెంట్ సర్పంచ్‌గా, నా భార్య శ్రీమతి భ్రమరాంబ 2001లో సర్పంచ్‌గా నిలబడితే సుందరమ్మ పేట ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి, మాకు మద్దతుగా నిలచి ఓట్లు వేసి గెలిపించారని, ఆ కృతజ్ఞతతోనే సుందరమ్మ పేటలో ఉన్న అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లు వేసి, డ్రైన్లు కట్టించి, మంచినీటి పైపు లైన్లు వేయించి, కరెంట్ సదుపాయం కల్పించి అన్ని రకాలుగా సుందరమ్మ పేటని స్వర్ణమోకాభివృద్దిగా తీర్చిదిద్దినట్టు చెప్పారు
అందుకే ఇక్కడి ప్రజలు కులమతాలకు, పార్టీలకు అతీతంగా నన్ను తమ ఇంటిలో సొంత బిడ్డలాగా ఆదరిస్తారని, నేను కూడా వీళ్ళని నా కుటుంబ సభ్యులువలే భావిస్తానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ)గా వరుసగా నేను పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓటమి అనేదే లేకుండా నన్ను గెలిపించి, నిర్విర్వామంగా 25 సంవత్సరాలు ఏదొక అధికార పదవిలో సుదీర్ఘకాలంగా పనిచేసే విధంగా నన్ను రాజకీయ విత్తనంగా నాటిన నా ఉయ్యూరు పట్టణ కుటుంబ సభ్యుల ఋణం తీర్చుకోలేనిదన్నారు. నేను భవిష్యత్తులో పదవిలో ఉన్నా లేకపోయినా ఉయ్యూరు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, అది నా బాధ్యతగా భావిస్తానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జంపాన గుర్నాధరావు, నడిమింటి పైడయ్య, మీసాల అప్పలనాయుడు,లంకె అప్పలనాయుడు, అనిల్, నరేష్, చిరంజీవి, నజీర్, అజ్మతుల్లా, ఫణి, అంజి, కుటుంబరావు, సాంబశివరావు, నరేష్, పుల్లేశ్వరావు, పీఎస్ నాయుడు, సుబ్బారావు, పవన్ మరియు పెద్దఎత్తున యువకులు, 14 వార్డు ప్రజలు పాల్గొన్నారు.