గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (07:07 IST)

ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ తనయ... ఏ పార్టీ తరపునంటే...

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల బరిలో నందమూరి కుటుంబ వారసులారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదే నిజమైతే.. నందమూరి కుటుంబం నుంచి ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తున్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. గతంలో పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్, ఆ తర్వాత ఆయన తనయుడు నందమూరి హరికృష్ణలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణ కుమార్తె సుహాసిని బరిలోకి దిగనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. 
 
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... సుహాసినికి కూకట్ పల్లి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను పార్టీ ముఖ్యనేతలు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 
 
ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్‌ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి. నిజానికి ఈ ఇక్కడ నుంచి హీరో కళ్యాణ్‌రాంను బరిలోకి దించాలని టీడీపీ నేతలు భావించగా, ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో సుహాసిని పేరును తెరపైకి తెచ్చారు. 
 
మరోవైపు, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన సీట్లలో కూకట్‌పల్లి ఒకటి. ఈ సీటుకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అలాగే, మరో మూడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నాలుగు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.