సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (11:48 IST)

విశాఖ ఉక్కు అమ్మకానికి మరో అడుగు : న్యాయ సలహాకు నోటిఫికేషన్

విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కన్సల్టెంట్‌ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. 
 
ఈ విషయం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీలోకి అడుగుపెడితే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.