శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (10:33 IST)

స్నేహం వేరు రాజకీయాలు వేరు.. అందుకే పవన్‌కు హ్యాండిచ్చా : అలీ

తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీని కాదని వైకాపాలో చేరడానికిగల కారణాలను సినీ నటుడు అలీ వివరించారు. స్నేహం వేరు... రాజకీయాలు వేరంటూ ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అలీ వైకాపాలో చేరారు. 
 
ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు అలీ సమాధానమిచ్చారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్‌ తనకు స్నేహితుడు, అత్యంత సన్నిహితుడైనప్పటికీ స్నేహం వేరు.. రాజకీయాలు వేరన్నారు. ముఖ్యంగా, పవన్ సక్సెస్‌ను తన సక్సెస్‌గా భివించే వక్తినని అలీ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల్లో తమ ఇద్దరివీ వేర్వేరు దారులన్నారు. 
 
ఇకపోతే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే, రాజమండ్రి లేదా గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో ఒకదాన్ని కేటాయిస్తే మాత్రం పోటీ చేస్తానని చెప్పారు. అదేసమయంలో ఈ ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ, వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని అలీ స్పష్టంచేశారు.