శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (10:53 IST)

నాకు ఎలాంటి సంబంధం లేదు.. తితిదే ఛైర్మన్ వైవీ

రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తపై సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సదరు నిర్వాహకులకు తనకూ ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
క్రిస్మస్ వేడుకలకు సంబంధించి తనను ఎవరూ ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఇది ఎవరో కావాలని తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఇలాంటి చౌకబారు చేష్టలకు పాల్పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.