శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 7 ఆగస్టు 2017 (14:30 IST)

శ్రీవారి సేవలో వెంకయ్య... కొత్త వెలుగు కనిపించింది...(వీడియో)

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత స్వామివారిని దర్శించుకోవాలని ముందుగానే భావించానని, అనుకున్న విధంగానే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనం తరువాత మానసిక స్థైర్యం, స్వాంతన, ఉత్సాహం, స్ఫూర్తి, విశ్వాసం ఏర్పడిందని, అలాగే కొత్త వెలుగు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమృద్ధ భారతదేశం  దిశగా అభివృద్థి వైపు మన దేశం నడవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.