2019లోపు విశాఖకు రైల్వో జోను వస్తుంది : సిట్టింగ్ ఎంపీ హరిబాబు
వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల లోపు విశాఖపట్టణంకు రైల్వే జోన్ కేటాయిస్తారని సిట్టింగ్ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు.
వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల లోపు విశాఖపట్టణంకు రైల్వే జోన్ కేటాయిస్తారని సిట్టింగ్ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు కేటాయించడం, విశాఖ రైల్వేజోన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సురేష్ ప్రభును రాజ్యసభకు నామినేట్ చేయడంపైనా, విశాఖకు రైల్వే జోన్ కేటాయింపు అంశంపై హరిబాబు స్పందిస్తూ... తన పదవీకాలం ముగిసే లోపు రైల్వేజోన్ వస్తుందన్నారు. అదేసమయంలో రైల్వే జోనుకు, సురేష్ ప్రభుకు రాజ్యసభ టిక్కెట్ కేటాయించడంపై లింకు పెట్టొద్దని ఆయన కోరారు.