ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:32 IST)

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

Dr Saikrishna
విజయవాడ, కానూరులో ఉన్న అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తమ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించింది, ఇది ఈ ప్రాంతంలో అధునాతన క్యాన్సర్ సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. హాడ్జికిన్స్ లింఫోమాతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడు మాస్టర్ ఉదయ్ వికాస్‌కు ఈ మార్పిడిని నిర్వహించారు. మాస్టర్ ఉదయ్‌, తొలుత మెడ వాపు సమస్యతో వచ్చాడు. అతనికి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. ఈ సోషరస వ్యవస్థను సాధారణంగా శరీర రోగనిరోధక వ్యవస్థ అని పిలుస్తారు, ఇది అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. 
 
మూడు సైకిల్స్ కీమోథెరపీని చేసిన తర్వాత, ఈ బాలునికి ఎముక మజ్జ మార్పిడి జరిగింది. అతను ఇప్పుదు మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. విజయవాడ కానూరులోని AOIలో క్రమం తప్పకుండా అతను పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఈ విజయంపై, CTSI-దక్షిణాసియా CEO హరీష్ త్రివేది మాట్లాడుతూ, “హాడ్జికిన్స్ లింఫోమా అనేది పిల్లలలో అరుదైన పరిస్థితి, అయినప్పటికీ అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావటం చేత నిర్వహించ తగిన, చికిత్స చేయగల క్యాన్సర్లలో ఒకటిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో, హాడ్జికిన్స్ లింఫోమా వంటి పిల్లల క్యాన్సర్‌ల సంభవం ప్రత్యేక చికిత్సా సౌకర్యాలను పొందడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ విజయవంతమైన ఎముక మజ్జ మార్పిడితో, AOI విజయవాడ ప్రపంచ స్థాయి క్యాన్సర్ సంరక్షణను ఇంటికి దగ్గరగా తీసుకురావాలనే తన నిబద్ధతను ప్రదర్శించింది. అన్ని వయసుల రోగులకు అత్యాధునిక చికిత్సలను అందించాలనే తమ లక్ష్యాన్ని ప్రతిబింబించే ఈ విజయం పట్ల తాము గర్విస్తున్నాము” అని అన్నారు 
 
AOI కానూరులోని మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ కొల్లూరు ఈ కేసు గురించి మాట్లాడుతూ, “పిల్లలలో హాడ్జికిన్స్ లింఫోమా చికిత్స, నిర్వహణకు బహుళ విభాగ విధానం, ఖచ్చితమైన సంరక్షణ అవసరం. వ్యాధి యొక్క సంక్లిష్టత, ఎముక మజ్జ మార్పిడి అవసరం కారణంగా మాస్టర్ ఉదయ్ కేసు చాలా కీలకం. ఈ ప్రక్రియ యొక్క విజయం మా నైపుణ్యం, అధునాతన మౌలిక సదుపాయాలు, మా రోగి యొక్క స్థిరత్వం కు నిదర్శనం. "కోలుకునే మార్గంలో అతను ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది." అని అన్నారు.
 
AOI ఆంధ్రప్రదేశ్ రీజియన్ RCOO, మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, "ఈ మైలురాయి విజయం సంక్లిష్టమైన పీడియాట్రిక్ ఆంకాలజీ కేసులను నిర్వహించగల AOI విజయవాడ సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. ఈ ప్రాంతంలో మొట్టమొదటి పీడియాట్రిక్ ఎముక మజ్జ మార్పిడిని నిర్వహించడం మా మొత్తం బృందానికి గర్వకారణం. అధునాతన క్యాన్సర్ కేర్‌ అవకాశాలను విస్తరించడంతో పాటుగా మా రోగులకు ఉత్తమ ఫలితాలను అందించాలనే మా నిరంతర ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మేము స్థిరంగా కృషి చేస్తూనే ఉన్నాము" అని అన్నారు. 
 
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ కేర్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది, ఆంధ్రప్రదేశ్, చుట్టుపక్కల ఉన్న రోగులు మరియు కుటుంబాలకు ఆశను కలిగిస్తుంది.