మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 జులై 2021 (16:40 IST)

విశాఖలో పోలీసులు వర్సెస్ మావోలు మధ్య కాల్పులు

విశాఖపట్టణం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు మావోల కోసం తనిఖీలు చేస్తుండగా, మావోలు గుర్తించి కాల్పులకు తెగబడ్డారు. 
 
దీంతో పోలీసులు కూడా ప్రాణ రక్షణ నిమిత్తం ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం మావోలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సివుంది.