ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 13 జులై 2020 (20:09 IST)

ఏపీలో జూనియర్ కాలేజీలు ఎప్పటి నుండి ప్రారంభం?

ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆగస్టు 3 నుండి కాలేజీలను ప్రారంభించాలని ఇందులో మొత్తం 196 రోజులు పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలండర్‌ను సిద్దం చేసిన ఉన్నత విద్యాశాఖ, సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొన్నది.
 
ఇక ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులను నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీలను నడిపించాలని, పండుగుల సందర్భంలో మాత్రం ఒకటిరెండు రోజులు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అదేవిధంగా విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని ఆన్లైన్ పాఠాలు నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది.
 
యధావిధిగా వచ్చే ఏడాది మార్చిలోనే వార్షికలు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్ బుక్ ప్రత్యేకంగా ఇస్తామని, జేఈఈ మెయిన్ పరీక్షలుకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని స్పష్టం చేసింది.