సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 మార్చి 2024 (13:46 IST)

విజయవాడలో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న కేశీనేని శివ, ఎందుకు?

Kesineni Shiva
కర్టెసి-ట్విట్టర్
తెలుగుదేశం నాయకుడు, కేశీనేని శివనాథ్ విజయవాడలోని 56వ డివిజన్‌లో కేశినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్వయం ఉపాధిలో ఉన్న మహిళలకు ఉచితంగా ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు అందజేసి వారికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.
 
కరీముల్లా టీ స్టాల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, మహిళలకు టీడీపీ అందిస్తున్న ఆదరణ గురించి వివరించారు. మహిళల సాధికారత కోసం పార్టీ నిబద్ధతను ఎత్తిచూపిన ఆయన, మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
 
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న పార్టీ టీడీపీ అని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడేందుకు చంద్రబాబు నాయుడుకు అండగా నిలవాలని శివనాథ్‌ కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఏ పథకాలనూ రద్దు చేయబోమని హామీ ఇచ్చిన ఆయన, రాబోయే సూపర్ సిక్స్ పథకాల అమలును ప్రస్తావించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మురుగుర్తి ఈశ్వర్ యాదవ్, టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు.