శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:38 IST)

భార్య ఆవేశం.. భర్త ప్రాణాలు తీసింది.. ఎక్కడంటే?

భార్యాభర్తల అనుబంధం కనుమరుగు అవుతోంది. ఆధునికత ముసుగులో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆడామగా తేడా లేకుండా.. అన్నీ రంగాల్లో సమాన హక్కులు రావడంతో భార్యాభర్తల మధ్య గొడవులు కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా నేరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య ఆవేశం.. భర్త ప్రాణాలు తీసింది. 
 
వివరాల్లోకెళితే.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాసులు, సరిత దంపతుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన భార్య సరిత.. తన భర్త శ్రీనివాసులుని కర్రతో బలంగా కొట్టింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శ్రీనివాసులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో శ్రీనివాసులు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకున్నారు.