శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (12:19 IST)

బడ్జెట్ 2018-19.. రాజధాని లేదు.. ఆదాయాన్ని కోల్పోయాం: యనమల

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తగినంత

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తగినంత సాయం అందట్లేదని.. దీంతో పాటు రాష్ట్ర విభజన ద్వారా ఆదాయాన్ని, రాజధాని కోల్పోవడం ద్వారా ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని యనమల ప్రకటించారు. 
 
ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయ రంగానికి రూ.12,352కోట్లు. గతంలో పోలిస్తే 35.91 శాతం అదనంగా ప్రకటించినట్లు యనమల తెలిపారు. అలాగే సాగునీటి రంగానికి రూ.16,978.23కోట్లను కేటాయించారు. ఈ మొత్తం గతానికంటే 32.95శాతం అధికమని యనమల తెలిపారు.
 
ఇక.. యనమల బడ్జెట్‌లోని కీలక అంశాలను పరిశీలిస్తే.. 
* కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902.19కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు.
* ఇంధన రంగానికి రూ.5,052.54కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.3,074.87కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ.12,200కోట్లు
* విద్యా రంగానికి రూ.24,185.75కోట్లు. గతంలో పోలిస్తే 18.65 శాతం అదనం
* క్రీడలు, యువజన సేవల శాఖకు రూ.1,635.44 కోట్లు. గతంలో పోలిస్తే 62.7 శాతం అదనంగా కేటాయించినట్లు యనమల ప్రకటించారు.