గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 జనవరి 2025 (18:40 IST)

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

Papad
అప్పడాలు. భోజనంతో పాటు సైడ్ డిష్‌గా వీటిని కరకరమంటూ తింటుంటారు. ఈ అప్పడాల తయారీ ఎలా చేస్తారో తెలిస్తే చాలామంది షాకవుతారు. అప్పడాల పిండిని ఓ పెద్ద పాత్రలో కలిపి దాన్ని ఓ పాత్రపై పూతలా వేస్తారు. ఆ తర్వాత ఇలా వేసినవన్నీ కలిపి ఒక్కచోట వేసి వాటిని కాళ్లతో తొక్కి గుండ్రటి అప్పడాలను తీస్తారు. అలా వచ్చిన వాటిని బండలపై వేసి ఎండబెడతారు. ఇలా చేసిన వాటిని తినడమా లేక తినకపోవడమా అనేది మీ ఛాయిస్.
 
ఇకపోతే... అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.
 
అప్పడాలలో ఉప్పు అధికం, కనుక ఇది రక్తపోటు- గుండె జబ్బులకు ప్రధాన కారణమౌతుంది. అప్పడాలను వేయించడానికి పదేపదే ఉపయోగించే నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు అప్పడాలను తినరాదు. అప్పడాలను మైక్రోవేవ్‌లో కాల్చినప్పుడు, అక్రిలమైడ్, ఆల్కలీన్ ఉప్పు కంటెంట్ కారణంగా క్యాన్సర్ కారక పదార్థం ఏర్పడుతుందని పరిశోధన రుజువు చేసింది.