మంగళవారం, 21 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 జనవరి 2025 (13:19 IST)

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

golden Milk
Golden Milk పసుపు పాలు. జలుబు, జ్వరం, చర్మవ్యాధులకు పనిచేస్తుందని చెప్పుకునే పసుపు పాలతో ఇంకా మరికొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని తేలింది. ఇంతకీ పసుపు పాలు అంటే ఏమిటి... చూద్దాం. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా తేనె, కొద్దిగా నెయ్యి వేసి చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకుంటే అవే పసుపు పాలు. వీటిని రోజూ రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 
 
అజీర్తి, ఛాతీలో మంట వంటివి ఈ పసుపు పాలు తాగితే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటు నియంత్రణలో వుంచుతాయి. ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లేమటరీ గుణాలుంటాయి కనుక రోగ నిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల అదనపు బరవు తగ్గి కంట్రోల్‌లో వుంటుంది.
 
కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ వుంటే అనారోగ్యాలను దరి చేరనివ్వదు.