ఆదివారం, 19 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 జనవరి 2025 (22:20 IST)

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

Sesame dates balls
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి.
నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
నువ్వులలో పిండి పదార్థాలు తక్కువ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికం, ఇవి రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడతాయి.
మెనోపాజ్ సమయంలో హార్మోన్ బ్యాలెన్స్‌కు తెల్ల నువ్వులు సహాయపడుతాయి.