1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (16:40 IST)

కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడినందుకే సస్పెన్షన్ వేటు: రోజా ఫైర్

అవినీతిరహిత పాలన అంటూనే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారు: రోజా ఫైర్

అవినీతి డబ్బుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఏపీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఇష్టానుసారం కొంటున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా రోజా సస్పెన్షన్పై డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
 
ఈ నేపథ్యంలో రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీసేందుకు ప్రయత్నిస్తుంటే మా గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కాల్ మనీ వ్యవహారం ఎంత పెద్ద విషయమో అందరికీ బాగా తెలుసునన్నారు. ఈ స్కామ్‌లో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. 
 
కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారని రోజా ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎంతోమంది అమాయక మహిళలు తమ మాన ప్రాణాలు కోల్పోయారని ఎన్నో దౌర్జన్యాలకు గురయ్యారని కొంత మంది తమకు జరిగిన అన్యాయాలపై బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. ఓ వైపు అవినీతిరహిత పాలన అంటూనే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ బాబు ఇద్దరు ఏపీని అడ్డంగా దోచుకుంటున్నారని రోజా ధ్వజమెత్తారు.