శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 మార్చి 2024 (22:17 IST)

నా పిఠాపురం ప్రజలను అర్థిస్తున్నా, నన్ను గెలిపించండి: పిఠాపురంలో పవన్

Pawan Kalyan in Pithapuram
కర్టెసి-ట్విట్టర్
పిఠాపురంలో(Pithapuram) జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారానికి పిఠాపురం ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జనసేన విజయభేరిలో ప్రజలనుద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఇప్పటిదాకా నేను ఎవరినీ ఏమీ అడగలేదు. 2019లో కూడా నేను అడగలేదు. కానీ ఇప్పుడు నా పిఠాపురం ప్రజలను అభ్యర్థిస్తున్నాను. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. 54 గ్రామాల ప్రజలను పేరుపేరునా అడుగుతున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు నాకు కావాలి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి, అభివృద్ధి ఎలా వుంటుందో చూపిస్తాను. అధికారంలోకి రాగానే పిఠాపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాను.
 
నాకు జగన్ రెడ్డిలా తాతగారి గనులు లేవు, సాధారణ మధ్యతరగతి కానిస్టేబుల్ కొడుకును, మా అన్నయ్య గారు ఇప్పించిన యాక్టింగ్ ట్రైనింగ్ ద్వారా కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చాను. MLAగా గెలిచిన వెంటనే నేను పిఠాపురంలో ఇంటి కోసం స్థలం తీసుకుంటాను. నేను మీ భావోద్వేగాలు గౌరవించే వ్యక్తిని. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు చేస్తాను.
 
Pithapuram
కేంద్రంలో దేవాలయాలకు ప్రత్యేక స్కీం ఉంది, కానీ మన పిఠాపురం కోసం వైసిపి ఆ స్కీం ఉపయోగించలేదు, నేను పిఠాపురం దేవాలయాల అభివృద్ది కోసం 70 నుండి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తాను. జాతీయ పర్యాటక ప్రాంతంగా చేస్తాను. నేను ఇక్కడ ఎంఎల్ఏ అయ్యాక కాకినాడ డాన్ ఎలా పిఠాపురంలో అడుగుపెట్టి దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తాడో చూద్దాం. ఒంటరి ఉద్యమం చేస్తున్నాను దశాబ్ద కాలం నుండి. చేతులు జోడించి అడుగతున్నాను నన్ను గెలిపించండి.'' అని పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.