ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?
ఏపీలో శనివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 5 కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యారు. ఈ నగలను డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళుతుండగా ఈ చోరీ జరిగింది. అయితే, ఈ పోలీసులే ఈ చోరీకి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. జ్యూవెలరీ షాపు సిబ్బందిని బెదిరించి నగల సంచీని ఎత్తుకెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, దొంగతనం జరిగిందని చెప్పిందని ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు... అక్కడ దొంగతనం జరిగినట్టు కనిపించడం లేదన్నారు. జ్యూవెలరీ షాపు డెలివరీ బాయ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలో శనివారం రాత్రి ఈ ఘరానా దొంగతనం జరిగింది.