శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:32 IST)

అన్న టీ-షర్ట్ వేసుకున్న తమ్ముడు, తన్నులాటలో ఒకరు మృతి

అన్నదమ్ముల మధ్య ఓ టీ-షర్ట్ విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను తీసింది. ఏపీలోని శ్రీకాకుళం సంతబొమ్మాళి మండలంలోని కాకరాపల్లిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రమేష్-సురేష్ ఇద్దరూ అన్నదమ్ములు. గురువారం నాడు అన్నయ్య రమేష్ టీషర్టును తమ్ముడు సురేష్ వేసుకున్నాడు. తమ్ముడు తన టీషర్ట్ వేసుకోవడాన్ని చూసిన రమేష్ అతడితో వాగ్వాదానికి దిగాడు. తనది ఎందుకు వేసుకున్నావు, వెంటనే విప్పేయాలంటూ గొడవపడ్డాడు.
 
ఈక్రమంలో ఇద్దరూ ఒకరికొకరు నెట్టుకున్నారు. తమ్ముడు రమేష్ తన అన్నయ్య సురేష్ ను గట్టిగా నెట్టడంతో కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి తలకు రాయి బలంగా తగలడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. ఐనప్పటికీ అతడి పరిస్థితి విషమించి మృత్యువాతపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.