ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 7 అక్టోబరు 2021 (17:51 IST)

కొండ‌ప‌ల్లి ఖిల్లాలో క్లీన్ ఇండియా - 750 కేజీల వ్య‌ర్థాల‌ ఏరివేత‌

ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా కొండ‌ప‌ల్లి ఖిల్లాపై యువ‌త క్లీన్ ఇండియా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం పిలుపుతో యువ‌త స్పందించారు. క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని చ‌రిత్రాత్మ‌క‌మైన కొండపల్లి ఖిల్లాలో పారిశుధ్య‌ప‌నులు చేప‌ట్టారు.

ఖిల్లా  ప్రాంగణంలో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ క‌వ‌ర్లు ఏరివేశారు. 750 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను పొగు చేసి, వాటిని కొండపల్లి ఖిల్లాకు దూరంగా  గార్బేజ్ ఏరియాలో డంప్ చేశారు. కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్, మ‌దర్ తెరిస్సాచారిట‌బుల్ ట్రస్ట్ స‌భ్యులు ఇందులో పాల్గొన్నారు. నెహ్రూ యువ  కేంద్ర విజయవాడ  యూత్ ఆఫీసర్ సుంకర రాము  పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి భూమిని కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో సుంక‌ర రాము,ఎన్.వై.కె. యూత్ ఆఫీస‌ర్, విజ‌య‌వాడ, బి.వినోద్ కుమార్, కృష్ణ‌దేవ‌రాయ యూత్ ఆర్గ‌నైజేషన్, సుధ‌ కోయ‌, మ‌ద‌ర్ థెరెస్సా ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌భ్యులు పాల్గొన్నారు. నెహ్రూయువ కేంద్రం వాలంటీర్లు మెహన్,వెంకన్న బాబు, సుజాత, మెదుగు బాబు, గోపాల్ ,నవీన్, అభినేష్ స్టేడియం హౌస్ కీపింగ్ వర్కర్స్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.