శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:14 IST)

చేసేది మేస్త్రీ పని... ఇంట్లో కిలోన్నర బంగారం.. రూ.1.25 కోట్లు స్వాధీనం.. ఎక్కడ?

శ్రీవారి కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు ఏవిధంగా దోచుకుంటున్నారో మరోమారు నిరూపితమైంది. తితిదే కళ్యాణకట్టలో మేస్త్రీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట రూ.1.25 కోట్ల న

శ్రీవారి కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు ఏవిధంగా దోచుకుంటున్నారో మరోమారు నిరూపితమైంది. తితిదే కళ్యాణకట్టలో మేస్త్రీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట రూ.1.25 కోట్ల నగదుతో పాటు కిలోన్నర బంగారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులకు అవాక్కయ్యారు. వారు విస్తుపోయేలా వాస్తవాలు బయటపడ్డాయి. కొర్లకుంటలోని తంగవేలు ఇంట్లో సహా, ఆయన సమీప బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు జరుగుతుండగా, ఇప్పటివరకూ రూ.1.25 కోట్ల విలువైన నగదు, ఆస్తి పత్రాలు, కిలోన్నరకు పైగా బంగారం పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. 
 
తంగవేలు బినామీల పేరిట కూడా భారీఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు తేల్చారు. తమ సోదాల్లో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశముందని, ఇదంతా అక్రమ సంపాదనేనని, విషయాన్ని టీటీడీ అధికారులకు వివరిస్తామని అ.ని.శా పేర్కొంది.