నా లక్ష్యాలు నెరవేర్చే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తా : హీరో సుమన్
రాష్ట్ర రాజకీయాల్లోకి మరో హీరో ప్రవేశించనున్నారు. ఆయనెవరో కాదు సీనియర్ నటుడు సుమన్. ఈయనకున్న కొన్ని లక్ష్యాలను నెరవేర్చేందుకు హామీ ఇచ్చే పార్టీ తరపున పోటీ చేస్తానని సుమన్ తాజాగా ప్రకటించారు.
రాష్ట్ర రాజకీయాల్లోకి మరో హీరో ప్రవేశించనున్నారు. ఆయనెవరో కాదు సీనియర్ నటుడు సుమన్. ఈయనకున్న కొన్ని లక్ష్యాలను నెరవేర్చేందుకు హామీ ఇచ్చే పార్టీ తరపున పోటీ చేస్తానని సుమన్ తాజాగా ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో అలాంటి ఏ పార్టీ ఉందన్న విషయాన్ని మాత్రం ఆయన సీక్రెట్‌గా ఉంచారు.
విశాఖ నగర బీసీ యువజన సంఘం తనను సన్మానించిన సందర్భంగా సుమన్ మాట్లాడుతూ బడుగులకు సేవ చేయడమే లక్ష్యంగా 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే గత కొంతకాలంగా వెనుకబడిన తరగతుల వారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు.
నటుడిగా ఉంటే కొంత మందికి మాత్రమే సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ బలంతోడైతే, మరింత మందికి సాయపడగలనన్న నమ్మకం తనకుందని అన్నారు. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే, తనకు కొన్ని లక్ష్యాలున్నాయని, వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పార్టీ తరపున బరిలోకి దిగుతానని అన్నారు.