శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (12:56 IST)

ముక్కోటితీర్థంలో ఆనందయ్య ఔషధం తయారీ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవతో ఆనందయ్య కుమారుడు శ్రీధర్‌, ఆయన శిష్యబృందం నేతృత్వంలో ఆదివారం రాత్రి ముక్కోటితీర్థంలో మందు తయారీని ప్రారంభించారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని 5లక్షలకు పైగా ప్రజలకు ఇంటింటికీ ఈ మందును పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఎవరూ ముక్కోటితీర్థానికి రావద్దని ఆయన సూచించారు.