బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (12:40 IST)

హీరోయిన్ కావాలనుకుంటే పెళ్లి చేస్తారా?: యువతి ఆత్మహత్య

ఆమె హీరోయిన్ కావాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వివాహం చేయాలనుకున్నారు. అంతే మనస్తాపంతో అనంతపురానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే అనంతపురం, గుంతకల్లు పట్టణ పరిధిలోని

ఆమె హీరోయిన్ కావాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వివాహం చేయాలనుకున్నారు. అంతే మనస్తాపంతో అనంతపురానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే అనంతపురం, గుంతకల్లు పట్టణ పరిధిలోని గంగానగర్‌కు చెందిన పెద్దన్న, లీలావతి దంపతుల కుమార్తె ప్రవీణ (17). ఈమెకు చిన్నప్పటి నుంచి కథానాయిక కావాలనే కోరిక వుండేది. 
 
అయితే, తల్లిదండ్రులు మాత్రం ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా సంబంధాలు కూడా చూడటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో, తనకు వివాహమైతే, ఇక హీరోయిన్ కల తీరదన్న మనస్తాపంతో ప్రవీణ తన ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.