1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Assembly Election Result 2024 LIVE: A comeback expected for Chandrababu Naidu

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : ఆధిక్యంలో చంద్రబాబు సహా పలువురు టీడీపీ అభ్యర్థులు

chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్‌, పూతలపట్టులో మురళీమోహన్‌ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబుకు 1,594, బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల ఆధిక్యం లభించింది. 
 
జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్‌, చిత్తూరులో గురజాల జగన్‌మోహన్‌కు లీడ్‌ వచ్చింది. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామచర్ల జనార్దన్‌, గుడివాడలో వెనిగండ్ల రాము, ఉండిలో రఘురామకృష్ణరాజు, గురజాలలో యరపతినేని శ్రీనివాస్‌, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, పెనుకొండలో సవిత, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, విశాఖపట్నం తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు లీడ్‌ వచ్చింది. రెండో రౌండ్‌ ముగిసేసరికి బుచ్చయ్య చౌదరి ఆధిక్యం 2,870కు పెరిగింది.
 
పోస్టల్ ఓట్లలో దూసుకుపోతున్న టీడీపీ కూటమి!! 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులోభాగంగా, ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూసుకునిపోతుంది. ఈ పోస్టల్ ఓట్లలో టీడీపీ ఏకంగా 31, జనసేన 5, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉండగా, కూటమి అభ్యర్థులు మొత్తంగా 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
తర్వాతి కథనం
జనసేన ఖాతా తెరిచింది.. పవన్ కళ్యాణ్ 4330తో ముందంజ