సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (11:41 IST)

రేపు కొలువుదీరనున్న ఏపీ మంత్రివర్గం.. జగన్ టీమ్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం శనివారం కొలువుదీరనుంది. సచివాలయంలో జరిగే కార్యక్రమంలో మంత్రులతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం నరసింహన్ శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
అయితే, జగన్ మంత్రివర్గంలో ఐదుగురు నేతలకు ఉప ముఖ్యమంత్రులు దక్కే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిలో ఆళ్ళ నాని (కాపు), కె.పార్థసారథి (యాదవ్), రాజన్న దొర (ఎస్టీ), ఆంజాద్ బాషా (మైనార్టీ), సుచరిత (ఎస్సీ)లను ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదిలావుంటే జగన్ మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పించనున్నాట్టు సమాచారం. ఈ మంత్రివర్గాన్ని అనుభవజ్ఞులతో కొత్తవారితో ఏర్పాటు చేయనున్నారు. శనివారం ఏర్పాటయ్యే మంత్రివర్గం రెండున్నరేళ్ళ పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు కూడా. కాగా, మే 30వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే.