భారీగా 104 అంబులెన్స్‌ల కొనుగోలుకు ఏపీ సర్కారు నిర్ణయం
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు భారీగా 104 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 539 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.89.27 కోట్ల ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 అంబులెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.
ఇందుకు సంబందించిన నిధులను వెంటనే విడుదల చేయాలనీ ఫైనాన్స్ శాఖను ఆదేశించారు సీఎం.. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అంబులెన్స్ కేటాయించాలని గతంలోనే అనుకుంది ప్రభుత్వం.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సరైన రవాణా వ్యవస్థ లేక ప్రాణాలు కోల్పోతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ఈ అంబులెన్స్ లను కొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.