మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:12 IST)

ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ నంబర్ వన్

andhra pradesh map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. "ఈజ్ ఆఫ్ డూయింగ్" బిజినెస్‌లో ఏపీ మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో ఏపీ మరోమారు నెంబర్ వన్‌గా నిలిచిందని ఇన్వెస్ట్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇలా పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏపీలో అపార వనరులు  ఉండటమే ముఖ్య కారణమని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 
 
గత 2019 అక్టోబరు నుంచి 2021 డిసెంబరు వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీ వచ్చాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు ఓడరేవులు, ఆరు విమాశ్రయాలు, 1.23 లక్షల కిలోమీటర్ల రహదారులు, 2600 కిలోమీటర్ల రైలు మార్గం ఉందని, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇన్వెస్ట్ ఇండియా అభిప్రాయపడింది. కృష్ణా నదీ పారివాహక ప్రాంతాల్లో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నట్టు ఆ సంస్థ అంచనా వేసింది.