1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (15:54 IST)

తిరుపతిలో ఇంజినీరింగ్‌ అభ్యర్థుల కోసం ఏపీఈపీసెట్‌-జెఈఈ(మెయిన్‌) కోర్సు ప్రారంభించిన ఆకాష్‌-బైజూస్‌

Image
టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో భారతదేశంలో అగ్రస్ధానంలో ఉన్న ఆకాష్‌-బైజూస్‌ ఇప్పుడు సెట్‌ (కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)ను తిరుపతిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటుగా జెఈఈ మెయిన్స్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న 11వ తరగతి విద్యార్థుల కోసం ప్రారంభించింది. ఆకాష్‌-బైజూస్‌ ఈ కోర్సును రాష్ట్ర బోర్డుల విద్యార్ధుల కోసం ఇంగ్లీష్‌లో ప్రారంభించింది. తమ బోర్డు పరీక్షలు పూర్తయిన తరువాత వారు ఈ కోర్సులకు హాజరుకావొచ్చు.
 
ముఖ్య ఆకర్షణలు :
ఏపీ ఈఏపీసెట్‌-జెఈఈ (మెయిన్‌) సిలబస్‌ పైన దృష్టి సారించి కరిక్యులమ్‌ సృష్టి.
ఇంగ్లీష్‌లో స్టడీ మెటీరియల్‌ అందించనున్నారు.
నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత టెస్ట్‌ పేపర్లను సిద్ధం చేయించనున్నారు.
విద్యార్థులకు ప్రత్యేక బ్యాచ్‌లను అందిస్తారు.
పదకొండవ తరగతి విద్యార్థులు ఏపీ ఈపీసెట్‌+జెఈఈ (మెయిన్‌)తో ఇంటిగ్రేటెడ్‌ కోర్సును ఎంచుకోవచ్చు.
 
ఈ నూతన ఎంసెట్-జెఈఈ కోర్సు, స్ధానిక మార్కెట్‌లను చేరుకోవడంతో పాటుగా రాష్ట్ర బోర్డుల విద్యార్థులకు ఇంజినీరింగ్‌  కోర్సుల లో  శిక్షణ అందించాలనే ఆకాష్‌-బైజూస్‌ యొక్క లక్ష్యంలో భాగం. సీబీఎస్‌ఈ- అనుబంధ పాఠశాలల విద్యార్థుల కోసం ఈ కరిక్యులమ్‌ డిజైన్‌ చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటుగా జెఈఈ మెయిన్స్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమగ్రమైన అభ్యాస పరిష్కారాలను అందించనుంది.
 
విద్యార్థులకు ఏపీఈపీసెట్‌-జెఈఈ (మెయిన్‌) కోసం ఇంటిగ్రేటెడ్‌ కోర్సును అందించడంతో పాటుగా 11వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక బ్యాచ్‌లను సైతం దీనికోసం నిర్వహించనున్నారు. ఈ బోధన మొత్తం ఆంగ్లంలోనే జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 9వేల అఫిలియేటెడ్‌ పాఠశాలల్లో  దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు పది మరియు 12వ తరగతి చదువుతున్నారు.  2021లో ఒక లక్ష మందికి పైగా విద్యార్థులు ఈఏపీ సెట్‌గా ఖ్యాతిగడించిన ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కోసం హాజరయ్యారు.
 
నూతన కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు :
పదకొండవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక బ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
ఏపీఈపీసెట్‌-జెఈఈ(మెయిన్‌) సిలబస్‌పై  దృష్టి కేంద్రీకరిస్తూ విస్తృతశ్రేణి కరిక్యులమ్‌ను సృష్టించనున్నారు.
ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ వంటి బోధనాంశాలలో  పదకొండవ తరగతి చదువుతున్న సిలబస్‌కు అనుగుణంగా అత్యున్నత నాణ్యత కలిగిన స్టడీ మెటీరియల్‌.
అత్యున్నత అనుసంధానిత టెస్ట్‌ పేపర్లను సృష్టించిన ఆకాష్‌-బైజూస్‌.
 
ఏపీఈపీసెట్‌+జెఈఈ(మెయిన్‌) కోర్సు ప్రారంభించిన సందర్భంగా శ్రీ ఆకాష్‌ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆకాష్-బైజూస్‌ మాట్లాడుతూ ‘‘మా ‘విద్యార్ధులే తొలుత’ విధానంతో, ప్రాంతీయ, ప్రధాన స్రవంతి విద్యార్థుల మధ్య అంతరాన్ని తగ్గించడంపై  దృష్టి కేంద్రీకరించబడింది. మా ఇంటిగ్రేటెడ్‌ సెట్‌ కోర్సు ద్వారా అత్యధిక సంఖ్యలో ఇంజినీరింగ్‌ విద్యార్ధులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, వారిని ఏపీఈపీసెట్‌ మాత్రమే కాదు జెఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ కోర్సులలో కూడా శిక్షణ అందిస్తున్నాం. మా అత్యున్నత శిక్షణ కలిగిన నిపుణులు  నాణ్యమైన మెంటారింగ్‌ను అందించడంతో పాటుగా ఈ పోటీ పరీక్షలలో విద్యార్థులకు సహాయపడనున్నారు’’ అని అన్నారు.