శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (13:23 IST)

నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తెలియదు.. అందుకే ఈ విషాదం : మంత్రి నారాయణ

తన కుమారుడు నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తనకు తెలియదని, అసలు తనకు ఎపుడూ అనుమానం రాలేదని ఏపీ మంత్రి పి.నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్‌తో పాటు అతని స్నేహితు

తన కుమారుడు నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తనకు తెలియదని, అసలు తనకు ఎపుడూ అనుమానం రాలేదని ఏపీ మంత్రి పి.నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. 
 
చేతికి అందివచ్చిన కుమారుడు కళ్లముందు కనిపించక పోవడంతో నారాయణ పూర్తి విషాదంలో కూరుకునిపోయాడు. ముఖ్యంగా.. నిషిత్ ఇక లేడు అన్న వార్తతో ఆయన కుప్పకూలిపోయారు. లండన్ నుంచి ఇండియాకు వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు.
 
నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడన్న విషయం తనకు తెలియదని... తెలిస్తే వారించేవాడినని కన్నీటితో అన్నారు. తనతో పాటు కలసి ప్రయాణించేటప్పుడు సాధారణ వేగంతోనే వెళ్లేవాడని... అందుకే ఈ విషయంలో నిషిత్‌పై తనకెప్పుడూ అనుమానం రాలేదని అన్నారు. కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న నారాయణను ఆపడం ఎవరి తరం కాలేదు. మరోవైపు, నిషిత్ అంత్యక్రియలు గురువారం ఉదయం పెన్నా నదీ తీరంలో పూర్తి చేశారు.