పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన నిర్మాణ సామాగ్రి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. తాజాగా పిచ్చిమొక్కల మధ్య సిమెంట్ బస్తాలు బయటపడ్డాయి. ఐదేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎందుకూ పనికిరాకుండా పోయింది. అమరావతిలో ఏపుగా పెరిగిన మొక్కలు, చెత్తా చెదారం తొలగిస్తుండగా ఈ సిమెంట్ బస్తాలు బయటపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఐదేళ్లపాటు అమరావతి వైపు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు. దీంతో పిచ్చిమొక్కలు మొలిచి, ఆ ప్రాంతమంతా అడవిలా తయారైంది. దీంతో రాజధాని నిర్మాణాల కోసం సేకరించిన సిమెంట్ బస్తాలు, ఇసుక, ఇతర సామాగ్రి అలానే ఉండిపోయి, ఎండకు ఎండి, వానకు తడిసి ఇపుడు ఎందుకూ పనికిరాకుండా పోయింది.
అయితే, 2024లో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇందులోభాగంగా, ఏపుగా పెరిగిన మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రం చేస్తున్నారు. దీంతో పాడైపోయిన వందలాది సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామాగ్రి బయటపడుతుంది.