శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (11:41 IST)

వచ్చే నాలుగేళ్ళలో ఒక్క మద్యం షాపు ఉండదు.. ఎక్కడ?

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక షాపులను రద్దు చేసింది. తాజాగా మరో 13 శాతం షాపులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంటే గత యేడాది కాలంలో ఇప్పటివరకు 33 శాతం మేరకు మద్యం షాపులు తొలగించనట్టయింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తోంది. వాటిని 2,965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం మేరకు షాపులను రద్దు చేశారు. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, యేడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, మందుబాబులను మద్యానికి దూరం చేయడానికి వీలుగా ఇటీవల ఏకంగా 75 శాతం మేరకు మద్యం ధరలు పెంచిన విషయం తెల్సిందే. అయినప్పటికీ.. ఏపీలో మద్యం విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.