గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (12:58 IST)

అమరావతిలో స్వామివారి ఆలయ భూకర్షణ పనులు ప్రారంభం...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం, అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూకర్షణ పనులు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి విచ్చేశారన్నారు. తాను ఆయన పాదాల దగ్గర పుట్టినట్లు, తర్వాత ఆయన పాదాల దగ్గరే పునర్జన్మ పొందినట్లు చెపుతూ... గత 2003వ సంవత్సరంలో అలిపిరి వద్ద తనపై మావోయిస్టులు జరిపిన దాడిని గుర్తుచేశారు. 
 
ఆ ప్రమాదం నుంచి బయటపడటం కేవలం వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష ద్వారానే జరిగిందనీ, ఆగమశాస్త్రానుసారం భూకర్షణ పనులు (నిర్మాణ పనులు)  ప్రారంభించి, 25 ఎకరాలలో దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు, స్వామివారి ఆశీస్సుల కోసం టీటీడీకి భూమిని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. 
 
అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం కట్టడం... దానికి మనందరం ప్రత్యక్షసాక్షులు కావడం మనందరి అదృష్టంమనీ, ప్రపంచమంతా హిందువులు భక్తిభావంతో కొలిచేదైవం.. మన రాష్ట్రంలో ఉండటం మనందరి పూర్వజన్మ సుకృతమని, అమరావతికి వెంకటేశుడి ఆశీస్సులు కావాలని కోరుకున్న ఆయన కృష్ణానదికి ఈ పక్కన వెంకన్న.. ఆ పక్కన దుర్గమ్మ ఉన్నారు. వీరిద్దరి రక్షణ, ఆశీస్సులతో అభివృద్ధిలో దూసుకుపోతామనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ పిల్లలకు భక్తి పెరిగినట్లు, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మన రాజకీయ నాయకులకు కూడా భక్తి పెరిగిపోతోంది. చూద్దాం ఇది ఏ మలుపు తిరుగుతుందో...