శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 4 మార్చి 2017 (22:27 IST)

చేనేత సమస్యలపై నినదించిన వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు... హాజరైన 13 చేనేత కుల సంఘాల నేతలు

పిఠాపురం : చేనేత రంగ అభివృద్ధికి సమగ్ర చేనేత విధానం అవసరమని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం తీర్మానించింది. చేనేతల సంక్షోభ నివారణకు చేనేత నవరత్న ప్రతిపాదనలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మునిసి

పిఠాపురం :  చేనేత రంగ అభివృద్ధికి సమగ్ర చేనేత విధానం అవసరమని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం తీర్మానించింది. చేనేతల సంక్షోభ నివారణకు చేనేత నవరత్న ప్రతిపాదనలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మునిసిపల్ కల్యాణ మండపంలో శీరం శ్రీరామచంద్ర మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అన్ని జిల్లాల నుంచి వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ ప్రతినిథులు హాజరయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల దుస్థితిపై సమగ్రంగా చర్చించారు.
 
దేశ, విదేశాల్లో చేనేతకు గిరాకివున్నా విధానపరమైన లోపలవలన వృత్తిమీద ఆధారపడి చేనేత కార్మికుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడని సదస్సు విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న చేనేత వర్గానికి శాసన సభ, మండలిలో తమ సమస్యలపై చర్చించడానికి  ప్రతినిధులు లేకపోవడాన్ని కూడా చేనేత రంగం కుంటుపడిపోవడాన్ని ప్రధాన కారణమని గుర్తించారు. 
 
దేశంలో రెండో అతిపెద్ద వృత్తి అయిన చేనేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతకన్ను వేశాయని... రైతులను ఏవిధంగా ఆదుకుంటున్నారో చేనేత కుటుంబాలను అదే విధంగా ఆదుకోవాలని  సదస్సులో వీవర్స్ యునైటెడ్   వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు శీరం శ్రీరామచంద్రమూర్తి డిమాండ్ చేశారు. చేనేత సమస్యలపై తన జీవితమంతా కృషి చేశానని... పాలకులు ఇప్పటికైనా చేనేతలకు మేలు చేసేలా కార్యాచరణతో రావాలని ఆయన కోరారు. దేశంలో రైతాంగం తర్వాత స్థానం చేనేతదేనని... అభివృద్ధి చెందడానికి చేనేతకు అన్ని అవకాశాలున్నా ప్రభుత్వం సహకారం కావాలని కర్ణభక్తుల సంఘం రాష్ట్ర అద్యక్షులు, ఫ్రంట్ ప్రతినిధులు కోట వీరయ్య అన్నారు.
 
చేనేత దేశ వారసత్వ సంపదైనందున తగిన గుర్తింపునిచ్చే భాద్యత ప్రభుత్వానిదేనని అలాగే అన్ని రాజకీయ పార్టీలు తమ మౌలిక సిద్దాంతాలలో చేనేతకు స్థానం కల్పించి జాతి సంపదను కాపాడాలని రాష్ట్ర కన్వీనరు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ డిమాండ్ చేశారు. చేనేత రంగ అభివృధ్ధికోసం " చేనేత నవరత్నాలు"  పేరిట కన్వీనరు విశ్వనాధ్ చేసిన తొమ్మిది సూచనలు సదస్సు ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. చేనేత నవరత్నాలు అమలు కోసం త్వరలో ప్రభుత్వాన్ని కలవనున్నట్టు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు కలవనున్నామని చెప్పారు. 
 
వీవర్స్ యునైటడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరుగా తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఎన్నిక చేనేతల సమస్యలపై సుధీర్ఘకాలంగా పోరాడుతున్న తూతిక శ్రీనివాస విశ్వనాథన్ ను వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కమిటీ నియమించింది. రాజకీయ ప్రముఖులకు చేనేత మీద అవగాహన లేకపోవడం వలన నైపుణ్యం ఉన్న ఈ రంగం కుంటుపడుతుందని  ఫ్రంట్ నూతన కార్యవర్గం త్వరలో ఏర్పాటు కానుందని భవిషత్తు కార్యక్రమాల దృష్ట్యా అన్ని చేనేత కులాల ప్రతినిదులతో రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 
 
త్వరలో ప్రాంతాలవారిగా  ఫ్రంట్ కార్యాలయాలు ఏర్పాటు చేసి చేనేత సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తుందని నేతలన్నలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో చేనేత పెద్దలు వై కోటేశ్వరరావు,  పొన్నూరు మేయర్ సజ్జా హేమలత, సింగరి సంజీవ కుమార్, పోతుల సునీత, కొప్పు రాజారావు, పాలాజీ బాలయోగి, ద్వారా సత్య శివప్రసాదరావు, కొమ్మన కొండబాబు, నాగేశ్వరరావు, బాలయోగి, కరెళ్ళ గణపతి, తూతిక అప్పాజీ, తదితరులు పాల్గొన్నారు. 
 
చేనేత రంగం అభివృద్ధికి "చేనేత నవరత్నాలు" పేరిట వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు విశ్వనాధ్ చేసిన తొమ్మిది తీర్మానాలను వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.  
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సమగ్ర చేనేత జాతీయ, రాష్ట్ర విధానం అమలు 
2. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు వర్షాకాలంలో "నేత విరామం" అమలు
3. చేనేత కార్పొరేషన్ రూ 2000 కోట్ల వార్షిక బడ్జెట్ తో ఏర్పాటు
4. ‘చేనేత భవన్’ రాజధాని అమరావతిలో నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలి. 
5. చట్టసభలలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బోర్డులో నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యం… జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో ప్రవేశం కల్పించాలి. 
6. చేనేత సంస్కరణలు  ఆప్కో, చేనేత సహకార సంఘాలలో అమలు చేసి ‘ఫైబర్, ఫాబ్రిక్, ఫ్యాషన్’ (FFF) నూతన వ్యాపార విధానాలకు అనుగుణంగా  చేనేత ఉత్పత్తి, వ్యాపార విస్తరణకు సహకారం. అమ్మకాలు జరుపుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
7. స్థానిక సంస్థల సమావేశాల్లో (పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్) చేనేత సహకార సంఘ ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం.
8. చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి లేదా ఈ రంగంపై  ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణ.
9. చేనేత రంగ సమగ్ర అభివృద్ధి, నేత కార్మికుడు సంక్షేమం కోసం  అన్ని చేనేత కులాలలో ఉన్నా నిపుణులతో కమిటీ (నిర్దిష్ట సమయంతో) ఏర్పాటు చేసి నివేదిక ప్రతిపాదనలు, అమలుకు కార్యాచరణ.