శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 30 మార్చి 2017 (15:12 IST)

సర్.. ప్లీజ్.. నా శాఖ తీసుకోవద్దండి...ఎవరు..?

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడేళ్ళవుతోంది. ఇప్పటికే టిడిపిలో కొంతమంది సీనియర్ మంత్రులు కూడా అయిపోయారు. అందులో కొంతమంది మంత్రుల పదవులు పోతున్నాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా వినిపించే

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడేళ్ళవుతోంది. ఇప్పటికే టిడిపిలో కొంతమంది సీనియర్ మంత్రులు కూడా అయిపోయారు. అందులో కొంతమంది మంత్రుల పదవులు పోతున్నాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా వినిపించేది రావెళ్ళ కిషోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. అయితే నారా లోకేష్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తరువాత సీనియర్ మంత్రుల్లోని శాఖలు కొన్ని పోతాయన్న విషయం వారికే తెలుసు.
 
అందులో ప్రధానంగా పల్లె రఘునాథరెడ్డి శాఖే. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఐటీ శాఖను నారా లోకేష్‌కు ఇవ్వాలని ఏకంగా బాబే నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం కొన్నిరోజుల క్రితమే పల్లెకు తెలుసు. అయితే గత వారం క్రితం పల్లె రఘునాథరెడ్డి చంద్రబాబునాయుడును కలిసి సర్ ప్లీజ్... ఐటీ శాఖను నా నుంచి వేరు చేయకండి. దయచేసి ఆ శాఖను ఉంచండంటూ ప్రాధేయపడ్డారట. అయితే దీనిపై మాత్రం బాబు ఏ విధంగా స్పందించలేదట. చూద్దాం... వెళ్ళు... అని పల్లెను అక్కడి నుంచి పంపేశారట. దీంతో ఆ శాఖ ఉంటుందో లేదోనన్న అనుమానంలో ఉన్నారు పల్లె రఘునాథరెడ్డి.