శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (13:11 IST)

బావ ఎలక్ట్రికల్ సైకిల్ తొక్కితే... బావమరిది బుల్లెట్ నడిపాడు... ఎవరా బావాబావమరుదులు?

బావ ఎలక్ట్రికల్ సైకిల్ తొక్కితే... బావమరిది బుల్లెట్ నడిపాడు... ఎవరా బావాబావమరుదులు అని అనుకుంటున్నారా? ఇంకెవరు... బావ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే.. బావమరిది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల

బావ ఎలక్ట్రికల్ సైకిల్ తొక్కితే... బావమరిది బుల్లెట్ నడిపాడు... ఎవరా బావాబావమరుదులు అని అనుకుంటున్నారా? ఇంకెవరు... బావ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే.. బావమరిది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 
 
శుక్రవారం అమరావతి ఉండవల్లి అతిథి గృహం వద్ద చంద్రబాబు ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కారు. ఇటు హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఆటోనగర్ భగీరథ సర్కిల్ నుంచి బుల్లెట్ ర్యాలీ తీశారు.
 
ఇదిలావుండగా, శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో జీఎన్‌టీయూ నుంచి ఆనందభారతి గ్రౌండ్ వరకు ర్యాలీ సాగింది. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాన్ని, దోమలపై దండయాత్ర కార్యక్రమం గురించి వివరిస్తూ యాత్ర జరిపారు. కాసేపట్లో కాకినాడ ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు.