శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (11:24 IST)

తెలుగు సమాజానికి ఇది గర్వకారణం : జేడీ వాన్స్‌‌కు సీఎం బాబు అభినందనలు

Chandrababu Naidu
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగాను, ఉపాధ్యక్షుడుగా జేడీ వాన్స్‌లు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్‌కు ఏపీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన జేడీ వాన్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూలాలు ఉన్న ఉషా వాన్స్, అమెరికా రెండో మహిళగా సేవలందించబోతున్న తెలుగు వారసత్వపు మొదటి మహిళగా అవతరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఇది గర్వకారణం. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయఢంకా మోగిచిన విషయం తెల్సిందే. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ దేశాధినేతలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.
 
అలాగే యూఎస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌కు చంద్రబాబు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. ఆయన భార్య తెలుగు మూలాలు ఉన్న ఉషా వాన్స్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు మెచ్చుకున్నారు.