సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (08:34 IST)

ఏపీ సీఎం జగన్... ఓ భూకబ్జాదారుడు : మంత్రి నారాయణ స్వామి

narayanaswamy
ఏపీ ఉప ముఖ్యమంత్ర్ నారాయణ స్వామి నోరు జారారు. తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ భూకజ్జాదారునిగా అభివర్ణించారు. పైగా, ఆయనకు మనమంతా అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. 
 
తిరుపతి వేదికగా వైకాపా ప్లీనరీ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొని మాట్లాడుతూ, జగన్ మాట్లాడేది అన్యాయం, అక్రమన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు 
 
అయితే, నారాయణ స్వామి నోరుజారిన విషయం వీడియోను సంపాదించిన తెలుగుదేశం పార్టీ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజం నిప్పులాంటిది.. ఎక్కువ సేవు నోట్లో దాచుకోలేరు అంటూ ఆ వీడియకు ఓ కామెంట్ జతచేసింది. అంతేకాకుండా, జగన్ పని అయిపోయిందంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది.