బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 జనవరి 2017 (22:14 IST)

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ 'పిట్ట'.. అంతే, జగన్ మోహన్ రెడ్డి 'కత్తి'... వర్మ కామెంట్స్

రాంగోపాల్ వర్మ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పైన ట్వీట్ల వర్షం కురిపించారు. వీరుడనేవాడు కత్తితో రణరంగానికి దూరంగా వుండడనీ, యుద్ధభూమికి వచ్చినవాడే నిజమైన వీరుడు అంటూ పవన్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. నిజమైన వీరు

రాంగోపాల్ వర్మ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పైన ట్వీట్ల వర్షం కురిపించారు. వీరుడనేవాడు కత్తితో రణరంగానికి దూరంగా వుండడనీ, యుద్ధభూమికి వచ్చినవాడే నిజమైన వీరుడు అంటూ పవన్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. నిజమైన వీరుడు జగన్ మోహన్ రెడ్డి అనీ, ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఓ గదిలో కూర్చుని ట్వీట్లు చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి మాత్రం వీరుడిలా ప్రవర్తించారనీ, ఆయన తీరుకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు వర్మ. 
 
పవన్ కళ్యాణ్ ఆర్కే బీచ్ వద్దకు వచ్చి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా ఎందుకు రాలేదో తనకు అర్థం కావడంలేదన్నారు. ఐతే రేపు ఉదయం ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం చూస్తుంటే ఏదో ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అనిపిస్తుందన్నారు. పవన్ రేపటి మీడియా సమావేశాన్ని చూస్తే కానీ పవన్ కేవలం ట్విట్టర్ పిట్టలా వుంటారో... ప్రత్యేక హోదా సాధనకు రణరంగంలోకి దూకుతారో తెలుస్తుందంటూ ట్వీట్ చేశారు వర్మ.