మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (15:12 IST)

కరోనాను నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలం: ఎంపీ రఘురామ

కరోనాను నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "ఏపీలో ప్రబలంగా ఉంది. దేశంలో 3వ స్థానం. ప్రభుత్వం విఫలమైన కారణంగా ప్రజలు బాధపడుతున్నారు. ఆక్సిజెన్, వెంటిలేటర్, మెడిసిన్ మొదలైనవి తగినంత స్టాక్‌లో లేవు.
 
ఒక వ్యక్తిని చెత్త వ్యాన్‌లో కరోనా కేంద్రానికి తీసుకెళ్లడాన్ని చూసి సిగ్గుతో తల దించుకున్నా. మా సీఎం వైఎస్ జగన్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? దానికి చింతిస్తున్నాము. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని వైద్య పోస్టులను ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించాలి" అని కోరారు.
 
ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష నిర్వహించాలని కోరారు. నియంత్రించడంలో నా ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అరవింద్ కేజ్రీవాల్ లా ఢిల్లీ ఒక మోడల్‌గా తీసుకొని జగన్ దానిని అనుసరించాలని సూచించారు.